రోహన్ బోపన్న సరికొత్త చరిత్ర..
- January 27, 2024
మెల్బోర్న్: ఇండియా టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న సరికొత్త చరిత్ర లిఖించాడు. 43 ఏళ్ల లేటు వయసులో డబుల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి రికార్డు సృష్టించాడు. మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్ టైటిల్ సాధించాడు. శనివారం జరిగిన ఫైనల్లో ఇటలీ జోడీ సైమన్ బోలెల్లీ-ఆండ్రియా వవస్సోరిపై బోపన్న-ఎబ్డెన్ జంట వరుస సెట్లతో విజయం సాధించింది. 7-6, 7-5తో ప్రత్యర్థిని మట్టి కరిపించి కెరీర్ లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫస్ట్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకున్నాడు రోహన్ బోపన్న.
తుది పోరులో బోలెల్లీ-ఆండ్రియా నుంచి తీవ్ర పోటీ ఎదురైనా వీరోచితంగా పోరాడి టైటిల్ గెలిచాడు. తొలి సెట్ గెలిచిన తర్వాత బోలెల్లీ-ఆండ్రియా జోడీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రెండు జోడీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఒక దశలో 3-4తో బోపన్న-ఎబ్డెన్ జంట వెనుకబడినప్పటికీ పట్టుదలతో పుంజుకుని రెండో సెట్ లోనే 7-5తో ఆటను ముగించారు.
లేటు వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి రికార్డు సృష్టించిన రోహన్ బోపన్నకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అతడిని అభినందిస్తూ సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







