‘హనుమాన్’ పాత్రలో కనిపించబోయేది ఆ నటుడేనా.?
- January 27, 2024సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్’ సినిమా ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇదే ఊపులో ‘హనుమాన్’ సీక్వెల్ కూడా స్టార్ట్ చేసేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
సీక్వెల్‌కి ‘జై హనుమాన్’ అనే టైటిల్ ఆల్రెడీ ‘హనుమాన్’ సినిమా క్లైమాక్స్‌లోనే ప్రకటించేశాడు.
అయితే, ఇప్పుడు హనుమాన్ పాత్రలో నటించబోయేదెవరు.? అనేదే అందరిలోనూ ఉత్కంఠగా నడుస్తోంది. ఓ స్టార్ హీరో ఈ సినిమాలో నటించబోతున్నాడు.. అదీ హనుమాన్ పాత్రలో అని ఇప్పటికే ప్రశాంత్ వర్మ చెప్పేశాడు.
దాంతో, ‘హనుమాన్’ సిరీస్‌పై అంచనాలు పెరిగిపోయాయ్. ఇక, ఇప్పుడు ఆ పాత్ర పోషించగలిగే స్టార్ హీరో ఎవరు.? అనేదే అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.
హనుమంతుడు పాత్ర అంటే.. భారీ కటౌట్ వుండాలి. స్టార్ హీరోల్లో ఆ స్థాయిలో కటౌట్ మరియు ఆ తరహా ఆటిట్యూడ్ ఎవరికి వుంది.? చిరంజీవి చేయలేనని చెప్పేశారు.
మిగిలిన స్టార్ హీరోలను ఊహించుకోలేం. అయితే, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న రానా పేరు ఒకింత వినిపిస్తోంది. కన్నడ స్టార్ హీరో అయిన యష్ పేరు కూడా వినిపిస్తోంది. అన్నట్లు ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి పేరు కూడా ఈ లిస్టులో వుంది. ఏమో చూడాలి మరి, ఎవరు ఈ పాత్రకు ఫిట్ అవుతారో.!
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక







