ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు..
- January 29, 2024
న్యూ ఢిల్లీ: 15 రాష్ట్రాల్లో ఏప్రిల్ 2, 3 తేదీల నాటికి ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 15 వరకు నామినేషన్ల దాఖలకు అవకాశం ఇచ్చారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితాల లెక్కింపు ఉండడనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తెలంగాణలో మూడు చొప్పున రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి
ముఖ్యమైన తేదీలు ఇవే..
ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల
నామినేషన్ల దాఖలుకు ఆఖరుతేది ఫిబ్రవరి 15
ఫిబ్రవరి 16 నామినేషన్ల పరిశీలన
నమినేషన్ల ఉపసంహరణకి ఫిబ్రవరి 20 గడువు
ఫిబ్రవరి 27 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
అదే రోజు సాయంత్ర 5గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







