గ్రేట్ నీరజ్ చోప్రా.. మరో అరుదైన గౌరవం
- February 09, 2024
న్యూ ఢిల్లీ: నీరజ్ చోప్రా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. స్విట్జర్లాండ్‌లోని 'టాప్ ఆఫ్ యూరోప్'గా పిలవబడే జంగ్‌ఫ్రౌజోచ్‌లోని ప్రసిద్ధ ఐస్ ప్యాలెస్‌లో ఫలకంతో సత్కరించారు. కళ్లుచెదిరే అద్భుతమైన ఐస్ ప్యాలెస్‌లో తన ఫలకాన్ని పెట్టడం చాలా గౌరవంగా భావిస్తున్నానని నీరజ్ చోప్రా ఉద్వేగంగా చెప్పాడు. చోప్రా సాధించిన అద్భుత విజయాలను ఈ వేడుకలో వివరిస్తూ అభినందనలతో ముంచెత్తారు. జంగ్‌ఫ్రౌజోచ్‌లో ఈ మేరకు ఓ స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని సందర్శించిన చోప్రా విజిట్ చేసి ఉద్వేగంగా మాట్లాడారు. తను ఉపయోగించిన అనేక జావెలిన్ లలో ఒకదాన్ని స్విస్ టూరిజమ్ డిపార్టెమెంట్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. దాన్ని స్మారక ఫలకం పక్కనే ఉంచారు. ఇది చాలా అరుదుగా జరిగే సన్మానం. అలాంటి ఫీట్ ను నీరజ్ చోప్రా దక్కించుకు్ననాడు. టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెడరర్, గోల్ఫ్ ప్లేయర్ రోరె మెక్‌ల్ రాయ్ కూడా ఇక్కడ మెమోరియల్ లు ఉన్నాయి. వెలకట్టలేని ప్లేయర్ల ప్రాక్టీస్, అంకితభావానికి నిదర్శనంగా జంగ్‌ఫ్రౌజోచ్ 'వాల్ ఆఫ్ ఫేమ్' నిలుస్తుందని స్విస్ టూరిజమ్ తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







