రమదాన్ క్యాంపెయిన్..నిరుపేదలను ఆదుకోవడానికి Dh160 మిలియన్ల సేకరణ

- February 17, 2024 , by Maagulf
రమదాన్ క్యాంపెయిన్..నిరుపేదలను ఆదుకోవడానికి Dh160 మిలియన్ల సేకరణ

యూఏఈ: దార్ అల్ బెర్ సొసైటీ రమదాన్ ప్రచారాన్ని ప్రారంభించింది. స్థానికంగా మరియు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉపవాసాలు మరియు పేద వ్యక్తులకు మద్దతుగా Dh160 మిలియన్లను సేకరించనున్నట్లు ప్రకటించింది. డార్ అల్ బెర్ సీఈఓ డాక్టర్ మహమ్మద్ సుహైల్ అల్ ముహైరి ఉపవాసం ఉన్న వ్యక్తులు, పేదలు, అనాథలు, అనారోగ్యంతో ఉన్నవారు, వితంతువులు, వంటి వివిధ బలహీన వర్గాలకు సహాయం చేయాలనే దాని లక్ష్యం గురించి వివరించారు. రమదాన్ ప్రచారంలో నాలుగు కాలానుగుణ ప్రాజెక్టులతో సహా 16 స్వచ్ఛంద ప్రాజెక్టులు మరియు కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు. రమదాన్ సమయంలో 23 ప్రదేశాలలో 324,000 మందికి ఇఫ్తార్ బోజనలను అందజేస్తామని డాక్టర్ అల్ ముహైరి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com