హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం..

- February 26, 2024 , by Maagulf
హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం..

హైదరాబాద్: హైదరాబాద్ లో డ్రగ్స్‌ భూతాన్ని తరిమికొట్టేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా… మత్తుపదార్థాలను సరఫరా చేసే కేటుగాళ్లలో మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో బీజేపీ నేత కుమారుడితో పాటు మరో ఇద్దరిని నార్కోటిక్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 

పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్‌పై దాడి చేసిన పోలీసులు… డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. కాగా, 2009 ఎన్నికల్లో హైదరాబాద్ నగర పరిధిలోని ఓ నియోజకవర్గం నుంచి సదరు నేత బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఆ హోటల్ కూడా ఆయనదేనని సమాచారం. మూడు రోజులుగా ఈ ముగ్గురూ పార్టీ చేసుకుంటున్నట్టు సమాచారం.ముగ్గురు యువకులనూ పోలీసులు విచారిస్తున్నారు.

 

 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com