వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!

- January 23, 2026 , by Maagulf
వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!

దావోస్: 9వ వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ కు 2026 ఖతార్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఫోరమ్ అక్టోబర్ 25 నుండి 27 వరకు దోహాలో జరుగనుంది. ఈ మేరకు ఖతార్ మరియు ఐక్యరాజ్యసమితి వాణిజ్యం మరియు అభివృద్ధి సంస్థ (UNCTAD) ప్రకటించింది.

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరమ్ సందర్భంగా విదేశీ వాణిజ్య వ్యవహారాల సహాయ మంత్రి హెచ్.ఇ. అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయీద్ మరియు UNCTAD సెక్రటరీ-జనరల్ హెచ్.ఇ. రెబెకా గ్రిన్‌స్పాన్ ఈ ప్రకటన చేశారు.

"ఇన్వెస్టింగ్ ఇన్ ది ఫీచర్" అనే థీమ్ తో జరిగే ఈ ఫోరమ్‌కు ప్రపంచవ్యాప్తంగా పాలసీ మేకర్స్, ఇన్వెస్టర్స్, బిజినెస్ లీడర్స్ మరియు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com