మెదడు చురుగ్గా ఉండాలంటే ఏం చేయాలి?
- June 03, 2016
కొత్త చదువులు, సరికొత్త భాష, బాగా ఇష్టపడే విద్య.. నేర్చుకోవడం ఏదైనా సరే మెదడు పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది! 'ఎలా నేర్చుకోవాలి?' అనే విషయంపై ఎన్నెన్నో సూచనలున్నా నేర్చుకోవడానికి మూలమైన బుర్ర చురుగ్గా ఉండాలంటే ఏం చేయాలి? చూద్దామా.కునుకుపడితే : మధ్యాహ్నం భోజనం ఐదు నుంచి పదినిమిషాలు, ఎప్పుడైనా మగతగా అనిపించినప్పుడు ఓ పావుగంట కునుకు తీయడం మంచిదంటున్నారు నిపుణులు. ఇది మెదడుకి ఎంతో ఉత్సాహాన్నిస్తుందట. గుర్తుపెట్టుకోవడం, విశ్లేషించడం వంటి సామర్థ్యాలనీ పెంచుతుంది.నిద్రకి ముందు.. : మెదడుకో లక్షణం ఉంది. మన శరీరం బాగా విశ్రాంతి కోరుకుంటున్నప్పుడే ఎక్కువ సృజనాత్మకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా నిద్రపోవడానికి కాస్తముందు మనకు బాగా నచ్చిన అభిరుచిని సాధన చేయడం చాలా మంచిదంటారు. సృజన రచన, చిత్రలేఖనం, సంగీత సాధన.. ఏదైనా కావొచ్చు మీరు పడగ్గదికి వెళ్లేలోపు సాధన చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుందట.కాలినడక చాలు : చురుకైన వ్యాయామం కూడా మన మెదడు సామర్థ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా కార్డియో వ్యాయామాల వంటివి కేవలం శరీరానికే కాదు బుర్రకీ ఎంతో మేలు చేస్తాయి. రోజుకి కనీసం 15-20 నిమిషాలన్నా వ్యాయామం చేయండి. వ్యాయామశాలకి వెళ్లక్కర్లేదు.. అలసటొచ్చేలా నడిచినా చాలు!కొత్తవి చేయండి! : కొత్తవి నేర్చుకుంటూనే ఉండండి. రోజూ చేసే పాత పనులైనా సరే.. కొత్తగా ఏదైనా చేయగలరేమో ఆలోచించండి. ఈ 'నవ్యత' మన మెదుడులో ఎప్పటికప్పుడు నూతన న్యూరోట్రాన్స్మీటర్లని సృష్టిస్తుందట
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







