శ్రీ శ్రీ : రివ్యూ
- June 03, 2016
ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా దర్శకుడు అనుకున్న పాయింట్ పాతదే అయినా దాన్ని తెర రూపం దాల్చే విషయంలో లోటు పాట్లు చేశాడు. సినిమా సంగీతం అందించిన ఈ.ఎస్.మూర్తి పర్వాలేదనిపించుకున్నాడు. సినిమాటోగ్రాఫర్ సతీష్ ముత్యాల ఓకే అనిపించుకోగా ఎడిటర్ రమేష్ సినిమా ఎడిటింగ్ ఇంకాస్త మంచిగా చేసి ఉండే అవకాశం ఉంది. సినిమా కథను అనుకున్న విధంగా తీసేందుకు కావాల్సిన స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చేందుకు నిర్మాత సాయి దీప్ చట్ల కూడా మంచి కోపరేట్ చేసినట్టున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ గోల్డెన్ జూబ్లీ కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఆయన మీద అభిమానంతో శ్రీ శ్రీ సినిమాను ముప్పలనేని శివ డైరెక్ట్ చేయడం జరిగింది. అయితే సినిమా పాయింట్ ఏమాత్రం కొత్తది కాదు.
కూతురిని అన్యాయంగా చంపిన వారిపై కక్ష్య తీర్చుకోవాలన్న కసి ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. అయితే ఓ మర్డర్ చేయాలంటే మేధస్సు ఉంటే చాలు మనిషి సత్తువ లేని వాడైనా సరే పర్వాలేదని నిరూపించాడు.
ఇక సినిమా కథ కథనాలు అన్ని బాగానే ఉన్నా సినిమా కేవలం కృష్ణ గారిని అభిమానించే వారికి.. ఇక ఘట్టమనేని ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చే అవకాశాలున్నాయి. సమాజంలో దుర్మార్గులు వచ్చిన ప్రతిసారి వారిని ఎదురించేందుకు ఎప్పుడు ఓ శ్రీ శ్రీ వస్తాడన్న డైలాగ్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. దర్శకుడు కథలో కొంత క్లారిటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇక స్క్రీన్ ప్లే కూడా మొదటి భాగం లో ఆమె క్యారక్టర్ ను చంపేసి మరళ అదే ఫ్లాష్ బ్యాక్ సెకన్ హాఫ్ లో ముందునుండి కంటిన్యూ చేయడం జరుగుతుంది. అయితే ఆడియెన్స్ అప్పటికే శ్వేతను చంపేసిన ఎపిసోడ్ చూసుండటం వల్ల సెకండ్ హాఫ్ సీన్స్ కాస్త బోర్ అనిపిస్తాయి.
అసలు కథ విషయానికొస్తే తన కూతురిని చంపిన వారి మీద పగ తీర్చుకోవడమే లేట్ వయసైనా సరే శ్రీ శ్రీ పంతంతో వారిని మట్టి కరిపిస్తాడు. సినిమాలో హైలెట్ ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ వాయిస్ ఓవర్.. సినిమా స్టార్ట్ అయినప్పుడు.. మళ్లీ లాస్ట్ లో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఫ్యాన్స్ ను ఉత్తేజ పరుస్తుంది. ఇక లాస్ట్ లో సుధీర్ బాబు సడెన్ సర్ ప్రైజ్ ఇస్తాడు.
సో మొత్తానికి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వేలెత్తి చూపే ఓ మీడియా యువతిని చంపితే, డబ్బు మదంతో చట్టం ముందు తప్పించుకున్నా శ్రీ శ్రీ 'లా' లో వారికి మరణ శిక్ష అంటూ సూపర్ స్టార్ డిసైడ్ చేసి వారందరినీ చంపేయడంతో సినిమా సూపర్ ఎండ్ అవుతుంది. అయితే సినిమాలో కామెడీ అసలు ఉండదు.. ఇక రెగ్యులర్ సినిమాలు చూసే వారికి ఈ సినిమా అసలు ఎక్కే అవకాశం లేదు. సమాజం గురించి అలోచించి ఆ బాధలను అనుభవిస్తున్న వారికి శ్రీ శ్రీ నచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







