'అభినేత్రి' చిత్రం టీజర్ విడుదల
- June 03, 2016
తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్ కీలక పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న 'అభినేత్రి' చిత్రం టీజర్ విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు ఎ.ఎల్. విజయ్, ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్, 'సోగ్గాడే చిన్నినాయనా' దర్శకుడు కల్యాణ్‌కృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుదేవా మాట్లాడుతూ... దర్శకుడు విజయ్‌కు ఓపిక చాలా ఎక్కువ అన్నారు. ఈ చిత్రం కథ కొంచమే తనకు తెలుసని, మొత్తం కథ తమన్నాకు తెలుసని పేర్కొన్నారు. తమన్నా మంచి నటి అని అభినందించారు. ఈ చిత్రంలో అమీ జాక్సన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు.
ఎం.వీ.వీ. సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







