అసెంబ్లీరౌడీ రీమేక్ లో హీరో విష్ణు
- June 03, 2016
స్టార్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోలకు.., తమ ముందు తరం వారు చేసిన సక్సెస్ ఫుల్ సినిమాలను రీమేక్ చేయాలన్న ఆలోచన ఉంటుంది. అయితే అలా రీమేక్ చేసి సక్సెస్ సాధించిన వారు చాలా తక్కువ. ముఖ్యంగా భారీ అంచనాలు ఏర్పడటంతో పాటు ప్రతి విషయంలోనూ పాత సినిమాతో పోల్చిచూస్తారన్న భయంతో చాలామంది రీమేక్ చేయాలని ఉన్నా ఊరుకుంటారు. కానీ ఓ యంగ్ హీరో మాత్రం ఆ రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు.మోహన్ బాబు కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన పోయిన చిత్రాల్లో అసెంబ్లీ రౌడీ ఒకటి. పాతికేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా హీరోగా మోహన్ బాబు రేంజ్ ను తారస్థాయికి తీసుకెళ్లింది. బి. గోపాల్ దర్శకత్వం, పరుచూరి బ్రదర్స్ అందించిన పదునైన మాటలు సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేశాయి.అందుకే ఇప్పటికీ మంచు ఫ్యామిలీ అభిమానులకు అసెంబ్లీ రౌడీ స్పెషల్ సినిమానే. ఆ సినిమాను ఇప్పుడు మంచు వారబ్బాయి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. మోహన్ బాబు నటవారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన యంగ్ హీరో విష్ణు, కామెడీ, యాక్షన్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే బాటలో ఇప్పుడు తన తండ్రి కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన అసెంబ్లీ రౌడీ సినిమాను రీమేక్ చేసి తానెంటో ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడు. ఈ జనరేషన్ కు తగ్గట్టుగా కథలో చిన్న చిన్న మార్పులు చేసిన అసెంబ్లీ రౌడీ సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు విష్ణు. మరి పాతికేళ్ల క్రితం మురిపించిన అసెంబ్లీ రౌడీ ఈ జనరేషన్ ను ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







