దుబాయ్ లో తగ్గిన బంగారు ఆభరణాల కొనుగోళ్లు..!
- March 13, 2024
యూఏఈ: దుబాయ్ లో బంగారం మరియు ఆభరణాల ధరలు ఈ నెలలో రికార్డు స్థాయికి చేరుకోవడంతో దుకాణం దారులు, వినియోగదారులు కొనుగోలు చేసే ప్రణాళికలను వాయిదా వేస్తున్నారు. బంగారం ధరలు శుక్రవారం రికార్డు స్థాయిలో $2,194.99కి చేరుకున్నాయి. యూఏఈలో 24K వేరియంట్ గ్రాముకు Dh263.75 వద్ద ట్రేడవుతుండగా, 22K, 21K మరియు 18K వరుసగా గ్రాముకు Dh244.25, Dh236.25 మరియు Dh202.5 వద్ద ట్రేడవుతున్నాయి. దుబాయ్ బంగారం మరియు ఆభరణాల దుకాణదారులకు ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది. వివాహ వేడుకల కోసం ప్రతిష్టాత్మకమైన బంగారాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది సందర్శకులు దుబాయ్ కు వస్తారు. గోల్డ్ సిటీని సందర్శించే పర్యాటకులు తప్పనిసరిగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. మలబార్ గోల్డ్ & డైమండ్స్ అంతర్జాతీయ కార్యకలాపాలకు మేనేజింగ్ డైరెక్టర్ షామ్లాల్ అహమ్మద్ మాట్లాడుతూ.. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో వినియోగదారులు పండుగ సీజన్లో ధరలు తగ్గుముఖం పడతారనే అంచనాతో తమ ఆభరణాల కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్ లో పండుగల సందర్భంగా బంగారం మరియు ఆభరణాల డిమాండ్‌ను గణనీయంగా పెంచాయన్నారు. మరోవైపు దుబాయ్‌లోని చాలా మంది ఆభరణాలు దుకాణదారులకు అడ్వాన్స్ లేదా లాక్-ఇన్ సౌకర్యాలను అందిస్తాయి. వారి కొనుగోలు విలువలో కేవలం 10 శాతాన్ని అడ్వాన్స్‌గా చెల్లించడం ద్వారా వారు ప్రస్తుత బంగారం ధరకే బంగారాన్ని కోలుగోలు చేయవచ్చు. అదే ధర తగ్గిన సందర్భాల్లో తగ్గిన ధరలకే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని వివరించారు. ఇటీవలి కాలంలో పురుషుల ఆభరణాల విభాగంలో గణనీయమైన పెరుగుదల ఉందని, ఇది ఇప్పుడు అపారమైన వృద్ధి సామర్థ్యాన్ని అందించే వేగంగా అభివృద్ధి చెందుతున్న వర్గంగా మారిందని కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ తెలిపారు.
తాజా వార్తలు
- నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. డ్రైవర్‌కు జైలు, కారును ధ్వంసం చేసిన కువైట్ అధికారులు
- అబుదాబిలో షఖ్‌బౌట్ బిన్ సుల్తాన్ వీధిలో మూడు రోజుల పాటు పాక్షిక రహదారి మూసివేత
- అంతర్జాతీయ బాండ్ల జారీతో కువైట్‌కు 3.25 బిలియన్ డాలర్లు
- షార్జాలో పోగొట్టుకున్న, యజమానులు క్లెయిమ్ చేయని వస్తువుల నిర్వహణపై కొత్త చట్టం
- సౌదీ అరేబియాలో 5 డ్రోన్లను అడ్డుకున్న సంకీర్ణ దళాలు..
- ఏపీలో ఎన్నికల పై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- మొబైల్ ఫోన్ గొడవ..ఇద్దరి హత్యకు దారి
- దుబాయ్‌లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్‌లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం







