నానికి జోడీగా కీర్తి..
- June 04, 2016
నేను శైలజ సినిమాతో టాలీ వుడ్ ఇండ్రస్టీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. స్టార్ వారసులిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త ఇబ్బంది పడినా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ టాలీ వుడ్‌లో మరో ఇంట్రస్టింగ్ ప్రాజె క్ట్‌కు రెడీ అవుతోంది. టాలీవుడ్‌లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ప్రూవ్ చేసుకున్న నానికి జోడీగా నటించనుంది కీర్తి.ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జెంటిల్‌మేన్ సినిమాలో నటిస్తు న్నాడు. దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా త్వర లోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత సినిమా చూపిస్తా మామ ఫేం త్రినాథ్ రావ్ దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించాడు.కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చాలా కీలకం. అందుకే గ్లామర్‌తో పాటు నటిగా కూడా మంచి మార్కులు సాధిం చిన కీర్తి సురేష్‌ను ఈ సినిమాకు హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకు న్నారు. నేచురల్ స్టార్‌గా మంచి ఇమేజ్ ఉన్న నానితో కలిసి నటిం చడానికి కీర్తి సురేష్ కూడా ఇం ట్రస్ట్ చూపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







