కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించనున్న ప్రభుత్వం
- June 04, 2016
ప్రతి కార్మికుడికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) సౌకర్యం కల్పిస్తామని, అవసరమైతే ప్రీమియం తగ్గిస్తామని కేంద్ర, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. కార్మికులకు కనీస పెన్షన్ రూ. 1000 చేశామని చెప్పారు. శనివారం హైదరాబాద్ లో దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడారు. బోనస్ సవరించి రూ. 10 వేల నుంచి రూ.21 వేల వరకు పెంచామన్నారు. కార్మికులందరికీ యు విన్ కార్డులు అందుబాటులో తెస్తామని చెప్పారు.ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో లాక్ అవుట్ లు లేవు అని దత్తాత్రేయ స్పష్టం చేశారు. కోటి మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ, కరీంనగర్ ఎంప్లాయ్ మెంట్ కార్యాలయాలను ఆధునీకరిస్తామన్నారు. బీడీ కార్మికులకు ప్రభుత్వం స్థలం కేటాయిస్తే ఇళ్లు కట్టిస్తామని దత్తాత్రేయ తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







