‘సరిపోదా శనివారం’.! నానితో ఈ సారి మామూలుగా వుండదు.!
- March 23, 2024
సినిమా సినిమాకీ డిఫరెంట్ వేరియేషన్స్ వున్న కథలు ఎంచుకుంటూ వరుస హిట్లు కొట్టుకుంటూ వస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. ‘దసరా’తో బీభత్సమైన మాస్ హిట్ కొట్టి, ‘హాయ్ నాన్న’ అంటూ ఛిల్ అయ్యాడు.
ఈ రెండు సినిమాలూ నానికి మంచి సూపర్ హిట్స్ అందించాయ్. ఇదే జోరులో వివేక్ ఆత్రేయతో సినిమా చేస్తున్నాడు నాని.
అదే ‘సరిపోదా శనివారం’. టైటిల్‌తోనే సినిమాపై ఆసక్తి పెంచేశాడు. మొన్నా మధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్‌గా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
ఆన్ సెట్స్ తీసిన పిక్ అది. రక్తం కారుతున్న చేయిని ఈ పిక్‌లో చూపించారు. అంటే తాజా షెడ్యూల్‌లో ఏదో బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారని అర్ధమవుతోంది.
అంతేకాదు, ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ అప్‌డేట్ శనివారమే రిలీజ్ చేయాలనుకుంటున్నారట చిత్ర యూనిట్. టైటిల్‌ని గుర్తు చేస్తూ వుండేందుకే ఇలా ప్లాన్ చేసినట్లున్నారు. ఈ సినిమాలో ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో కనిపిస్తుండగా, ప్రియాంక అరుల్ మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







