'ప్రతినిధి-2' టీజర్ లాంచ్ చేసిన చిరంజీవి

- March 30, 2024 , by Maagulf
\'ప్రతినిధి-2\' టీజర్ లాంచ్ చేసిన చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ టీవీ జర్నలిస్టు మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ ప్రధానపాత్రలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ప్రతినిధి-2. తాజాగా ఈ చిత్రం టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి నేడు లాంచ్ చేశారు. ప్రతినిధి-2 చిత్రబృందం నేడు చిరంజీవి నివాసానికి వెళ్లింది. 

దర్శకుడు మూర్తి, హీరో నారా రోహిత్ ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రతినిధి-2 చిత్ర విశేషాలను మూర్తి, నారా రోహిత్... చిరంజీవికి వివరించారు. అనంతరం ఆయన లాప్ టాప్ ద్వారా టీజర్ ను ఆవిష్కరించారు. ఈ చిత్రం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నానని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మూర్తి... చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేశారు. 

టీజర్ చూస్తే పక్కా పొలిటికల్ చిత్రమని అర్థమవుతోంది. వానర ఎంటర్టయిన్ మెంట్స్, రాణా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ప్రతినిధి-2 చిత్రానికి కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మాతలు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com