లోక్ సభ ఎన్నికలకు ముందు రికార్డు స్థాయిలో నగదు స్వాధీనం

- April 16, 2024 , by Maagulf
లోక్ సభ ఎన్నికలకు ముందు రికార్డు స్థాయిలో నగదు స్వాధీనం

న్యూ ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు ముందు రికార్డు స్థాయిలో నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 75ఏళ్ల లోక్ సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ తెలిపింది. లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కు ముందు రికార్డు స్థాయిలో రూ.4వేల 650 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎన్నికల అధికారులు. ఇందులో నగదు రూపంలో 395.39 కోట్లు ఉంది. పట్టుబడిన బంగారం విలువ రూ.562.10 కోట్లు కాగా, సీజ్ చేసిన మద్యం విలువ రూ.489.31 కోట్లు.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో 3వేల 475 కోట్లు సీజ్ చేస్తే.. ఇప్పుడు అంతకుమించి అన్న రేంజ్ లో నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

ఈ ఏడాది మార్చి 1 నుంచి సగటున ప్రతీరోజూ 100కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లు తెలిపింది ఈసీ. ఫ్లయింగ్ స్వ్కాడ్ లు, స్టాటిస్టిక్ సర్వైలెన్స్ టీమ్ లు, వీడియో టీమ్ లు బోర్డర్ చెక్ పోస్టుల్లో తమ పనిని 24 గంటలూ చేస్తున్నాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. నగదు, మద్యం, ఉచితాలు, మాదకద్రవ్యాల తరలింపు, పంపిణీ కట్టడికి కృషి చేస్తున్నామని తెలిపింది.

సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తనిఖీలను ముమ్మరం చేసింది ఈసీ. రోడ్లపై ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో వాహనాల్లో తరలిస్తున్న పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం పట్టుబడుతోంది. వాటికి సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు, ఎన్నికల అధికారులు ఆ నగదు, బంగారాన్ని సీజ్ చేస్తున్నారు. కేసులు నమోదు చేసి దర్యాఫ్తు జరుపుతున్నారు. డబ్బుకి సంబంధించి సరైన పత్రాలు, ఆధారాలు చూపిస్తే మాత్రం పోలీసులు వాటిని సీజ్ చేయడం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com