హవర్ ఎకో-టూరిజంతో 3000 కొత్త కొలువులు
- June 06, 2016
హవార్, ఎకో ఫ్రెండ్లీ టూరిజం డెస్టినేషన్‌గా మారబోతోందని బహ్రెయిన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎడ్మా) వెల్లడించింది. హవార్ ప్రాజెక్ట్ 3000 ప్రత్యక్ష ఉద్యోగాల్ని కల్పించనుందనీ, ఇది స్థానికంగా ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపర్చుతుందని బహ్రెయిన్ రియల్ ఎస్టేట్ సంస్థ ముమ్‌తలాకత్ హోల్డింగ్ కంపెనీ (మంతలాకత్) వెల్లడించింది. 350 మిలియన్ బహ్రెయినీ దినార్స్ ఈ ప్రాజెక్ట్ కోసం వెచ్చించనున్నారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ సౌకర్యాలతో, ప్రైవేటు రంగం మద్దతుతో రిసార్ట్ లివింగ్ ఐలాండ్‌ని ఈ ప్రాజెక్టులో భాగంగా రూపొందిస్తున్నారు. ఎడ్మా యాక్టింగ్ సీఈఓ మొహమ్మద్ హాషిమ్ అల్‌కూహెజి, హవార్ ఐలాండ్స్‌ని గ్లోబల్ డెస్టినేషన్‌లా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. హావర్ ఐలాండ్స్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిటీ అనే ప్యానెల్‌ని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ షేక్ ఖాలిద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా డైరెక్షన్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు అల్‌కూహెజి చెప్పారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







