ఏపీలోని పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్..
- April 21, 2024
అమరావతి: వాతావరణంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో విపరీతమైన ఎండలు దంచికొడుతుండగా..కొన్ని జిల్లాలో మాత్రం వర్షం పడుతుంది. నిన్న తెలంగాణ లోని హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో వర్షం పడగా..నేడు ఏపీలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
మధ్యాహ్నం నుంచి అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు కొన్ని జిల్లాలకు రెయిన్ అలర్ట్ ప్రకటించారు. వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులు బలంగా వీచే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఆదివారం వరకు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందట. అయితే.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







