టర్కీలో తన భార్యస్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్‌..

- June 07, 2016 , by Maagulf
టర్కీలో తన భార్యస్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్‌..

చూసేందుకు ఎంత అల్లరిగా కన్పిస్తాడో..ఎంజా§్‌ు చేయటంలో అంతే యాక్టివ్‌గా ఉంటారుస్లైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌..ఎప్పటికపుడు కొత్త ప్లేస్‌లను విజిట్‌ చేయటం వైఫ్‌తో ప్రపంచం చుట్టేయటం బాగా అలవాటు.. రీసెంట్‌గా బన్నీ అండ్‌ ఫ్యామిలీ హైదరాబాద్‌లోని టర్కీ ఎంబసీలో హఠాత్తుగా దర్శనమిచ్చారు. అల్లు అర్జున్‌ తన కుటుంబంతో కలిసి టర్కీ టూర్‌ ప్లాన్‌ చేశాడనే విషయం చాలామందికి అర్ధమైపోయింది.. టూరిస్టు వీసాలు రావటం ఆలస్యం..ఎంచక్కా టర్కీలో తన భార్యస్నేహారెడ్డితో కలిసి ల్యాండ్‌ అయిపోయారు ఈస్టార్‌ హీరో. టర్కీలో ప్రపంచ ఖ్యాతి చెందిన టూరిస్టు ఎంట్రాక్షన్స్‌ చాలానే ఉన్నాయి.. అట్టాంఆ సిటీ సమీపంలోని కుర్సునులు, వాటర్‌ ఫాల్‌ ఫార్క్‌లో తన వైఫ్‌తో కలిసి చక్కర్లు కొడుతున్న ఫొటోలు ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చాయి..
వారం రోజులకు పైగా ఉండనున్న బన్నీ అండ్‌ ఫ్యామిలీ..అక్కడి ప్రఖ్యాతి చెందిన అన్నిప్రదేశాలను కవర్‌ చేయనున్నారట.. తన భార్య స్నేహారెడ్డితో కలిసి.. టర్కీ మొత్తాన్ని చుట్టేశాక హైదరాబాద్‌ వచ్చేసి..తన నెక్ట్స్‌ ప్రాజెక్టుని అనౌన్స్‌ చేస్తారట బన్నీ.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com