హరియాణా బస్సులో పేలుడు.. 15 మందికి గాయాలు..
- June 07, 2016
హరియాణాలోని ఓ ప్రైవేటు బస్సులో ఈరోజు పేలుడు సంభవించింది. ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలోని ఫతేబాద్ జిల్లాలోని బునా రోడ్డులో ప్రైవేటు బస్సులో ఉదయం 11 గంటల ప్రాంతంలో పేలుడు జరిగింది. జఖాల్ నుంచి ఫతేబాద్ వెళ్తున్న బస్సులో ఓ ప్రయాణికుడు పేలుడు పదార్థాలను బ్యాగులో తరలిస్తుండగా ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. బ్యాగు తీసుకొచ్చిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.హరియాణాలో బస్సులో పేలుళ్లు సంభవించడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







