హనుమంతుడి పాత్రలో కనిపించేది ఆ హీరో..నిజమేనా.?
- April 26, 2024
ఒక్క సినిమా ఈ డైరెక్టర్ రేంజ్ మార్చేసింది. యంగ్ జనరేషన్ ప్రశాంత్ వర్మ.. ఏకంగా తన పేరు మీద ఓ సినిమాటిక్ యూనివర్స్‌నే క్రియేట్ చేసేసుకున్నాడీ యంగ్ డైరెక్టర్.
గట్స్ వున్నవాళ్లకే హిట్స్ వస్తాయ్.. అంటూ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇక, ‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ చేయబోయే సినిమా ‘జై హనుమాన్’.
ఆల్రెడీ అనౌన్స్ చేయడంతో పాటూ, రోజుకో రకం ఇంట్రెస్టింగ్ న్యూస్‌తో పిచ్చెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇకపోతే, మొదటి పార్ట్‌లో ‘ధర్మ యుధ్దానికి సమయం ఆసన్నమైంది.. ఇక నీ రాక అనివార్యం హనుమా..’ అంటూ విభీషణుడి పాత్రతో పలికించిన డైలాగ్ రెండో పార్ట్‌పై అమితమైన ఆసక్తి నింపేలా చేసింది.
మొదటి పార్ట్‌కి మెయిన్ లీడ్ తేజ సజ్జా అయితే, రెండో పార్ట్‌కి హనుమాన్ పాత్రే మెయిన్ లీడ్ అని అర్ధమైపోయింది. దాంతో ఆ పాత్ర చుట్టూ అనేక రూమర్లు..
రూమర్లు నిజమే అంటూ ప్రశాంత్ వర్మ హింట్ ఇచ్చాడు కానీ, అసలు నిజం మాత్రం చెప్పలేదు. ఈ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తాడనుకున్నారంతా.. కానీ, అది కుదరదని తేలిపోయింది.
ఇక, ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేయదగ్గ నటుడు రానా. ఆయన చుట్టూ నడుస్తున్న రూమర్ నిజమే.. అంటే, సెకండ్ పార్ట్‌లో రానా, తేజ సజ్జా కలిసి నటించబోతున్నారన్న మాట. హనుమంతుడి పాత్రలో కనిపించేది రానానే అన్నమాట.. అని ప్రశాంత్ వర్మ మాటల ద్వారా అర్ధమవుతోంది. మరి నిజమా.? కాదా.? తెలియాలంటే ఇంకాస్త వెయిట్ చేయాలి మరి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు