‘మిరాయ్’ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్న తేజ సజ్జా.!
- April 26, 2024
‘హనుమాన్’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్న తేజ సజ్జా త్వరలో ‘మిరాయ్’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా నిజానికి వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. కానీ, లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై ఆసక్తి క్రియేట్ చేసింది.
ఇంతవరకూ సూపర్ హీరో ట్యాగ్ సొంతం చేసుకున్న తేజ సజ్జా ఇప్పుడు ‘మిరాయ్’తో సూపర్ యోధ టైటిల్‌ని దక్కించుకోబోతున్నాడు. ఈ సినిమాలో భీభత్సమైన యాక్షన్ ఘట్టాలున్నాయని గ్లింప్స్ ద్వారా చెప్పకనే చెప్పేశారు.
సామ్రాట్ అశోకుని నేపథ్యంలో ఈ సినిమా రూపొందబోతోంది. మంచు మనోజ్, దుల్కర్ సల్మాన్ వంటి మంచి నటులు ఈ సినిమాలో భాగం పంచుకోబోతున్నారు. తేజ సజ్జా లుక్స్ గట్రా ప్రామిసింగ్‌గా వున్నాయ్.
‘హనుమాన్’ అనూహ్య విజయంతో ఈ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. ఇంత బిల్డప్ ఈ సినిమాకి వున్నప్పటికీ, తేజ సజ్జా మాత్రం చాలా కామ్‌గా వున్నాడు.
ఏమాత్రం ఓవరాక్షన్ చేయకుండా ఒదిగా ఒదిగి వున్నాడు. అయితే, ఈ సినిమా కూడా సక్సెస్ అయితే మాత్రం తేజ స్జా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది ఇది మాత్రం పక్కా.!
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు