తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- April 26, 2024
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, ప్రేమికుల నుంచి ప్రశంసలు పొందిన సింగింగ్ రియాలిటీ షో ‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్’. ఇప్పటికే రెండు సీజన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ రియాలిటీ షో మూడో సీజన్ త్వరలోనే మెప్పించటానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఆడిషన్స్‌కు సంబంధించిన తేదీలు వెల్లడి కావటంతో ప్రోగ్రామ్ లో పాల్గొనాలనుకునే వారితో పాటు సంగీత స్వర సాగరంలో మునిగిపోవటానికి ఉవ్విల్లూరే అందరిలోనూ ఉత్సాహం నెలకొంది. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 కోసం మెగా ఆడిషన్స్ మొదటిసారి USAలో ప్రారంభం కానుండటం విశేషం. మే 4న న్యూజెర్సీలో టీవీ9 USA స్టూడియోస్,399 హూస్ లేన్, 2న ఫ్లోర్ పిస్కాటవే.. అలాగే మే 11న డల్లాస్‌లోని కాకతీయ లాంజ్ 4440 హెచ్.డబ్ల్యువై 121 టీవెసిల్, USA టెక్సాస్ విల్,లూయిస్ విల్లే 5లలో ఆడిషన్స్ జరగనున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ రెండు సీజన్స్‌కు సంగీత ప్రేమికులు, ప్రేక్షకుల నుంచే కాకుండా ఔత్సాహిక గాయకుల నుంచి చాలా గొప్ప స్పందన వచ్చింది.టెలివిజన్ రంగంలో ఈ కార్యక్రమం సరికొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసింది. దీంతో మూడో సీజన్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి. దీన్ని అందుకునేలా ఉంటుందని వాగ్దానం చేస్తోంది ఆహా. అందుకు కారణం ఏకంగా పదివేల మంది ఔత్సాహిక గాయకులు ఇందులో పాల్గొనబోతున్నారు. అందులో నుంచి 12 మంది మాత్రమే ఫైనల్ రౌండ్‌కు చేరుకుంటారు.
సంగీత దిగ్గజాలైన ఎస్.ఎస్.తమన్, గీతామాధురి, కార్తీక్ వంటి వారి నేతృత్వంలో గొప్ప న్యాయ నిర్ణేతల బృందం దీనికి మార్గనిర్దేశకం చేస్తోంది. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 వచ్చిన స్పందన మన తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న అసాధారణ సంగీత ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఎస్.ఎస్.తమన్, గీతామాధురి, కార్తీక్ వంటి వారి అమూల్యమైన మార్గదర్శకత్వం, నిర్మాణాత్మకమైన సద్విమర్శలు, అలాగే పోటీదారులను ఆరోగ్యకరమైన వాతావరణంతో ప్రోత్సహించడం అనేది ఔత్సాహిక గాయకులను గొప్పగా తీర్చిదిద్దడంలో, గొప్ప నైపుణ్యాలను వెలికి తీయటంలో కీలక పాత్ర పోషించాయి.
ఇప్పుడు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 అదే ఉత్సాహంతో సరికొత్త ప్రయాణాన్ని ఉల్లాసకరంగా ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రేక్షకులకు అసాధారణమైన ప్రతిభను వేదిక ప్రదర్శించటమే కాకుండా, సంగీతాభిమానులకు సమానమైన వినోదాన్ని అందించటంలో ఆహా తిరుగులేని నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుంది. మన హైదరాబాద్‌లో మెగా ఆడిషన్‌లు మే 5న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నాయి. ఔత్సాహిక గాయకులు తమ గాత్ర నైపుణ్యాన్ని ప్రదర్శించి గౌరవనీయమైన టైటిల్ కోసం పోటీ చేయటాని ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతోంది ఆహా.
తాజా వార్తలు
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్‌లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య







