‘సత్యభామ’గా ఇరగదీస్తున్న చందమామ.!
- April 27, 2024
పెళ్లి తర్వాత చందమామ కాజల్ అగర్వాల్ గ్లామరస్ పాత్రలకు కాస్త దూరమైంది. ఛాలెంజింగ్ రోల్స్ చూజ్ చేసుకుంటోంది. ‘భగవంత్ కేసరి’ సినిమాలో కాత్యాయనిగా బాలకృష్ణకు జోడీగా నటించింది. ఆ పాత్రకు తన వంతు పూర్తి న్యాయం చేసింది కాజల్ అగర్వాల్.
అలాగే ‘ఇండియన్ 2’ లో కమల్ హాసన్‌కి జోడీగా నటిస్తోంది. ఇలా స్టార్ హీరోల సినిమాలతో పాటూ, తనకంటూ స్పెషల్ ఇమేజ్ అదీ, హీరోయిన్ ఓరియెంటెడ్ ఇమేజ్ దక్కించుకోవాలనుకుంటోంది. ఆ క్రమంలో ‘సత్యభామ’ తరహా మూవీస్ చేస్తోంది.
ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రమే ‘సత్యభామ’. ఈ సినిమా అన్ని పనులూ పూర్తి చేసుకుని మేలో రిలీజ్‌కి సిద్ధంగా వుంది. మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోయే ‘సత్య భామ’ సినిమాలో కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ పోషిస్తోంది.
సీరియస్ పోలీసాఫీసర్‌గా ఈ సినిమాలో కాజల్ నటన అద్భుతంగా వుండబోతోందని ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ చెబుతున్నాయ్. ఈ గ్లింప్స్‌కి రెస్పాన్స్ కూడా ఓ రేంజ్‌లో వస్తోంది. ఇక, సినిమా అంచనాలను అందుకుంటే.. ఈ జనరేషన్ మేకర్లకు కాజల్‌ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని లేడీ సెంట్రిక్ మూవీస్ సిద్దం చేసుకునే అవకాశం కలుగుతుంది. అన్నట్లు, ఈ సినిమా కాజల్‌కి 60వ సినిమా కావడం విశేషం. సుమన్ చిక్కాల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







