'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- April 27, 2024
రామాయణం కథ ఆధారంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి.. అవన్నీ కూడా మంచి హిట్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు మరో సినిమా రాబోతుంది.. బాలీవుడ్ లో మరో రామాయణం సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
దంగల్ దర్శకుడు నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ లో రామాయణం తెరకెక్కబోతుంది. ఈ సినిమా గురించి ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే షూటింగ్ గురించి ఎటువంటి అప్డేట్ లేకుండానే సైలెంట్ గా షూటింగ్ ను మొదలు పెట్టినట్లు తెలుస్తుంది..
ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్, ఫిదా బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.. కన్నడ స్టార్ హీరో యశ్ రావణాసురుడు పాత్రలో నటిస్తున్నాడు.. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెప్తూనే మేకర్స్ సినిమాను సైలెంట్ గా సెట్స్ మీదకు తీసుకెళ్లారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్ నుంచి ఫోటోలు లీక్ అయ్యాయి.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ ఫొటోల్లో రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా ముస్తాబై ఉన్నారు. మరో ఫొటోలో రణబీర్ కారవాన్ నుంచి వెళ్తున్నట్టు కనిపిస్తుంది.. సాయి పల్లవి ఆ గెటప్ లో చాలా అందంగా ఉందంటూ సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఏ ఆర్ రెహమాన్, హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు..
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







