చెవిలో ఇన్ఫెక్షన్.! ఎందుకొస్తుంది.? చిట్కాలతో నివారించగలమా.?
- April 29, 2024చెవి నొప్పి.. చెవిలో ఏదైనా ఇన్‌ఫెక్షన్ కారణంగా వస్తాయ్. చెవి ఇన్ఫెక్షన్లు పలు బ్యాక్టీరియా, వైరస్ కారణంగా తలెత్తే సమస్యలు. ఈ సమస్యలు వచ్చాకా వీటిని నివారించుకోవడం కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసకోవడమే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.
అయితే, చెవిలో ఇన్ఫెక్షన్లకు కారణం ఏంటీ.? అలెర్జీలూ, సైనస్ సమస్యలు, చెవిలోని యూస్టేషియన్ ట్యూబులను అడ్డుకుంటాయ్. తద్వారా చెవిలో ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయ్.
రకరకాల ఇనుప వస్తువులతో చెవిలో తిప్పడం ఓ కారణం. అలాగే పొల్యూషన్‌లో తిరిగి వచ్చినప్పుడు ముఖం, చేతులతో పాటూ చెవుల్ని, ముక్కునీ కూడా శుభ్రంగా కడుక్కోవాలి.
చల్లని వాతావరణం ముఖ్యంగా చెవిలో ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంటుంది. అందుకే చల్లని వాతావరణంలో తిరిగేటప్పుడు చెవుల్ని కవర్ చేసుకునేలా స్కార్ఫ్ యూజ్ చేయడం.. లేదంటే చెవిలో మెత్తని బట్ట, దూదిని వుంచుకోవడం చేయాలి.
అప్పుడప్పుడూ ఇయర్ డ్రాప్స్ కూడా యూజ్ చేస్తుండాలి. ఇవి చెవి నొప్పితో పాటూ, ఇన్ఫెక్షన్లను రానివ్వకుండా కూడా సహాయ పడతాయ్. చెవిలో తీవ్రమైన నొప్పి వేధిస్తుంటే, ఐబుఫ్రోఫిన్ లేదా అసిటమినోఫిన్ వంటి నొప్పి నివారణ మందుల్ని వైద్యుని సలహాతో తీసుకోవచ్చు. చెవి ఇన్ఫెక్షన్‌ని అశ్రద్ధ చేయరాదు. ఏమాత్రం ఇన్ఫెక్షన్ లక్షణాలు తెలిసినా వెంటనే వైద్యుని సలహా తీసుకోవాలి.
తాజా వార్తలు
- BNI ఇండియా డెలిగేషన్తో బిజినెస్ కాంక్లేవ్.. 46 మంది హాజరు..!!
- కార్బన్ ఉద్గారాల తగ్గింపునకు కార్యాచరణ..ఈవీలకు ప్రోత్సాహం..!!
- యూఏఈలో అమెరికా అపాంట్మెంట్స్..డిలే, రిస్క్ ను ఎలా తగ్గించాలంటే..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..!!
- ఆన్ లైన్ లో అటెస్టేషన్ సేవలు ప్రారంభం..ఇక 24గంటలు క్లియరెన్స్ సర్టిఫికేట్..!!
- 120 మిలియన్ల తీవ్రవాద కంటెంట్ తొలగింపు.. 14వేల ఛానెల్స్ మూసివేత..!!
- టీమిండియా ఆల్రౌండ్ షో….తొలి టీ20లో బంగ్లా చిత్తు
- TANA వైద్యశిబిరం విజయవంతం-550 మందికి చికిత్స
- Systematic Withdrawal Plan (SWP) ప్లాన్ లాభాల గురించి తెలుసా..?
- చెన్నై ఎయిర్ షో లో విషాదం