రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- April 29, 2024
హైదరాబాద్: ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మే 1వ తేదీకల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షాపై కాంగ్రెస్ నేతలే ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు గాంధీ భవన్‌కు వెళ్లారు. మే 1న ఫోన్ తీసుకొని విచారణకు రావాలని పోలీసులు తెలిపారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియోను రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా చెప్పినట్లుగా ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తోందని ఢిల్లీ, హైదరాబాద్‌తో పాటు పలురాష్ట్రాల్లో బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. వీడియో షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు పలు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ట్విట్టర్ హ్యాండిల్స్‌కు నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష