హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?

- May 13, 2024 , by Maagulf
హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?

యూఏఈ: రొటీన్ హెయిర్ స్ట్రెయిటెనింగ్ ప్రక్రియలు అప్పుడప్పుడు చర్మ సమస్యలు వంటి సాధారణ సమస్యల నుండి  కిడ్నీ సంబంధిత తీవ్రమైన రోగాల వరకు దుష్ప్రభావాలకు దారితీస్తాయని యూఏఈలోని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.  అయితే, దీనికి సంబంధించిన తీవ్రమైన కేసులేవీ దేశంలో కనిపించలేదని వారు చెప్పడం ఊరటనిచ్చే విషయం. కెరాటిన్ చికిత్సలతో ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.  ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఇటీవలి అధ్యయనంలో, సెలూన్‌లో హెయిర్ స్ట్రెయిట్నింగ్ ట్రీట్‌మెంట్ కారణంగా కిడ్నీ పాడైపోయిన మహిళకు సంబంధించిన కేసును డాక్టర్లు నివేదించారు. దుబాయ్‌లోని మెడియోర్ హాస్పిటల్‌లోని స్పెషలిస్ట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పాలోస్ పి థామస్ దీనిపై స్పందించారు.హెయిర్ స్ట్రెయిటెనింగ్ ట్రీట్‌మెంట్‌లు మరియు హెయిర్ డైలలో సాధారణంగా వివిధ రసాయనాలను ఉపయోగిస్తారని, సాధారణంగా అవి సురక్షితం అయినప్పటికీ సున్నితమైన స్వభావం ఉండే వ్యక్తులలో దుష్ప్రభావాలు అధికంగా కనిపించే అవకాశం ఉందన్నారు.  "అత్యంత తరచుగా వచ్చే దుష్ప్రభావం స్కిన్ అలెర్జీ. అరుదైన సందర్భాల్లో, ఈ పదార్ధాల యొక్క చిన్న మొత్తంలో రక్తంలోకి చేరి, ఇది అలెర్జీ ఇంటర్‌స్టీషియల్ నెఫ్రైటిస్‌కు దారితీయవచ్చు. తీవ్రమైన మూత్రపిండ వైఫల్యంతో కూడిన తీవ్రమైన పరిస్థితి, కొన్నిసార్లు డయాలసిస్ అవసరం అవుతుందని డాక్టర్ థామస్ వివరించారు. “గ్లైక్సిలిక్ యాసిడ్ మరియు గ్లైకోలిక్ యాసిడ్ బలమైన హెయిర్ స్ట్రెయిటెనింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. దీనిని సాధారణంగా కెరాటిన్ ఆధారిత హెయిర్ స్ట్రెయిటెనింగ్‌లో ఉపయోగిస్తారు. అనుకోకుండా ఇది రక్తంలో చేరడం వల్ల మూత్రపిండాలపై ప్రభావం చూపవచ్చు. మార్కెట్‌లో లభించే అటువంటి ఉత్పత్తులను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించాలని ఆస్టర్ సెడార్స్ హాస్పిటల్ మరియు క్లినిక్‌లోని స్పెషలిస్ట్ డెర్మటాలజీ, జెబెల్ అలీ, డాక్టర్ స్వాతి డెంబాల సూచించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com