రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- May 13, 2024
ముంబయి: ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.13.56 కోట్ల విలువైన 22.14 కిలోల బంగారం పట్టుబడింది. గత మూడు రోజుల్లో జరిపిన తనిఖీల్లో పలువురు ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులోభాగంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న 11 మంది ప్రయాణికులు పట్టుబడ్డారు. అక్రమ రవాణాపై 20 కేసులు నమోదయ్యాయని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
ప్రయాణికులు బంగారు కడ్డీలను వారి లోదుస్తులు, దుస్తులు, కార్డబోర్డ్ షీట్, బెల్ట్ మొదలైన వాటిల్లో దాచిపెట్టి అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారని అధికారులు తెలిపారు. మరో వ్యక్తి ఏకంగా మైనపు రూపంలో ఉన్న బంగారాన్ని మలద్వారంలో దాచి తరలిస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!