బాగ్దాద్‌లో కారుబాంబు పేలడంతో 22 మంది మృతి

- June 09, 2016 , by Maagulf
బాగ్దాద్‌లో కారుబాంబు పేలడంతో 22 మంది మృతి

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో గురువారం పేలుడు సంభవించింది. రద్దీ ఉండే ఓ ప్రదేశంలో కారుబాంబు పేలడంతో 22 మంది మృతిచెందారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఫల్లూజా ప్రాంతంలో తలదాచుకుంటున్న ఐసిస్‌ మిలిటెంట్లను ఇరాక్‌ భద్రతా బలగాలు తరిమికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసిస్‌ ఉగ్రవాదులు ఈ పేలుడుకు పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com