దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్

- May 18, 2024 , by Maagulf
దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్

తెలంగాణ: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన పంగ గంగాస్వామి, పొక్కిలి వంశీ అన్నారం గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల వద్ద పోసానిపేట్ గ్రామానికి చెందిన పళ్లెం భరత్ శ్రీ రాజరాజేశ్వర ట్రావెల్స్ ద్వారా 24 ఫిబ్రవరి దుబాయ్ కి కంపెనీ వీసా పైన పంపిస్తానని చెప్పి ఒక్కొక్కరి వద్ద 80 వేల రూపాయల చొప్పున 1లక్ష 60 వేల రూపాయలు తీసుకొని  మోసం చేసి దుబాయ్ కి పంపించిన పల్లెం భరత్ పైన కఠినమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. దుబాయ్ కి వెళ్లిన తర్వాత కంపెనీ విజా కాకుండా విసిట్ వీసా పై ఎందుకు పంపినావని ఏజెంట్ భరత్ను ఫోన్ చేసి అడిగినందుకు మా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కొడుకులను దుబాయ్ పోలీస్ వాళ్లకు పట్టించి పోలీస్ స్టేషన్లో వేయిస్తానని భయభ్రాంతులకు గురి చేయడంతో గంగ స్వామి, పొక్కిలి వంశీ తల్లిదండ్రులు తిరిగి రావాలని తిరిగి రావడానికి మళ్లీ మాకు 12 వేల రూపాయలు పంపితే తిరిగి 27 ఫిబ్రవరి మూడు రోజులలోనే అన్నారంకు రావడం జరిగిందని, ఇట్టి విషయం పైన రామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని దయచేసి మాకు న్యాయం చేయగలరని జిల్లా ఎస్పీ గారిని కోరారు. కంపెనీవిజా అని చెప్పి  మోసం చేసిన పంపిన భరత్ పైన అధికారులు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరారు.

--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి, తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com