అమెరికాలో తెలుగువారి కోసం NATS చాప్టర్ ప్రారంభం
- July 03, 2024
అమెరికా: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ తన పరిధిని విస్తరించుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే అట్లాంటాలో నాట్స్ చాప్టర్‌ని ప్రారంభించింది. ఇటీవలే ఫినిక్స్ చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్.. తాజాగా జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో నాట్స్ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అట్లాంటా తెలుకు ప్రముఖులు, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సురేశ్ పెద్ది ఆధ్వర్యంలో అట్లాంటా చాప్టర్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ తాజా మాజీ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ హరి మందాడి ఈ చాప్టర్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నాను. నాట్స్ చేస్తున్న సేవ కార్యక్రమాలను నాట్స్ జాతీయ నాయకులు అందరికి వివరించారు. తెలుగు వారికి అమెరికాలో ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా నిలబడుతుందనేది నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా రుజువు చేశామని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. భాషే రమ్యం సేవే గమ్యం నినాదాన్ని తన విధానంగా మార్చుకుందని నాట్స్ పని చేస్తుందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. అట్లాంటాలో ఇక నుంచి తెలుగు వారికి ఏ కష్టమోచ్చినా నాట్స్ వారికి అండగా నిలబడుతుందని నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సురేశ్ పెద్ది భరోసా ఇచ్చారు. నాట్స్ వాలంటీర్లకు ఎలాంటి గుర్తింపు ఇస్తుంది..? నాట్స్‌లో పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలను నాట్స్ నాయకులు బాపు నూతి, శ్రీహరి మందాడిలు వివరించారు. అట్లాంటాలో తెలుగు వారి కోసం పనిచేస్తున్న నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సురేశ్ పెద్ది చేసిన సేవలను నాట్స్ వాలంటీర్ బాల కంచర్ల గుర్తు చేశారు. ఇంకా ఈ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అభిలాష్ ఈడుపుగంటి, శిల్ప కోనేరు, ఠాగూర్ కోనేరు, నాగరాజు మంతెన, లోహిత్ మంతెన, శశిధర్ ఉప్పల, వంశీకృష్ణ ఈర్ల, శ్రీనివాస్ ఎడ్లపల్లి, ప్రసాద్ కల్లి, అనంత వాసిరెడ్డి, శివ మామిళ్ల శ్రీనివాస్ గోగినేని, సతీష్ అరెకట్ల తదితర నాట్స్ వాలంటీర్లు కీలకపాత్ర పోషించారు. అట్లాంటాలోని టామా, తానా, నాటా, ఆటా, గామా,టీటీఏ, ఆప్త,ఎన్ఆర్ఐవీఏ, గేట్స్ లాంటి స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా నాట్స్ అట్లాంటా చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
తాజా వార్తలు
- రక్షణ సహకారంపై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!
- బహ్రెయిన్-యుఎస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!
- ఒమన్ లో 15 కిలోల బంగారు కడ్డీలు సీజ్..!!
- ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారికి సమన్లు జారీ చేసిన యూఏఈ..!!
- ఖతార్ లో రెండు రోజుల పాటు సముద్ర నావిగేషన్ సస్పెండ్..!!
- గోల్డ్ రూల్స్..క్లారిటీ కోరిన యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ..!!
- ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని తప్పుబట్టిన UNSC..!!
- ముబారకియా మార్కెట్లో 20 దుకాణాలు మూసివేత..!!
- ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!