నేడు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
- July 04, 2024
న్యూ ఢిల్లీ: ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేటి సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. గతవారమే ఇరువురు సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ లోక్‌సభ సమావేశాల దృష్ట్యా అది వాయిదా పడింది. నేటి సాయంత్రం ప్రధానితో భేటీకి సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్‌మెంట్ లభించింది.
అయితే, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, అభించాల్సిన ఆర్థిక సహకారం, కేంద్ర పథకాల నిధుల విడుదలలో జాప్యం తదితర అంశాలను సీఎం ప్రధానికి దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈసారి సమావేశంలో తెలంగాణకు సంబంధించి పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, బొగ్గు గనుల వేలంలో సింగరేణికి భాగస్వామ్యం కల్పించడం, సైనిక్ స్కూల్ ఏర్పాటు, రక్షణ శాఖకు చెందిన భూములను రాష్ట్రానికి అప్పగించడం, విభజన చట్టంలోని అపరిష్కృతంగా ఉండిపోయిన కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, గిరిజన వర్సిటీకి నిధుల కేటాయింపు తదితర అంశాలను సీఎం రేవంత్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- భారత దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు
- యూఏఈలో ఇరాన్ ఎయిర్లైన్స్ విమానాలు నిలిపివేత.. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్
- దుబాయ్ ఫౌంటెన్ షోలు పునఃప్రారంభం.. తగ్గిన శబ్దంతో ప్రదర్శనలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!







