జులై 1న `దొర`గా వస్తున్న సత్యరాజ్
- June 13, 2016
చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ లో, తండ్రి పాత్రల్లో సత్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తమిళంలో జాక్సన్ దొరై అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని రత్నా సెల్యులాయిడ్స్ పతాకంపై జక్కం జవహర్‌బాబు తెలుగులో `దొర` అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ధరణీధరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా నటించారు. బిందుమాధవి నాయిక. కరుణాకరన్, సహాయం రాజేంద్రన్ ఇతర కీలక పాత్రధారులు. ఈ సినిమాలోని పాటలను జూన్ 21న, చిత్రాన్నిజులై 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా...
నిర్మాత జక్కం జవహర్‌బాబు మాట్లాడుతూ ``సత్యరాజ్‌గారికి తెలుగులో ఉన్న క్రేజ్ మనకు తెలిసిందే. తెలుగులో ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించారు. తమిళంలో పీరియాడికల్ హర్రర్ ఎంటర్ టైనర్ జాక్సన్ దొరై చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో `దొర` పేరుతో అనువదిస్తున్నాం. సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను జూన్ 21న విడుదల చేసి, సినిమాను తెలుగు, తమిళంలో .జులై 1న విడుదల చేస్తున్నాం. సిద్ధార్థ్ విపిన్ చాలా మంచి బాణీలను అందించారు. వెన్నెలకంటిగారు, చంద్రబోస్‌గారు చక్కటి సాహిత్యంతో పాటలు రాశారు. శశాంక్ వెన్నెలకంటి అద్భుతమైన డైలాగులు రాశారు. ఇటీవలికాలంలో వైవిధ్యమైన హారర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఆ కోవలో `దొర` కూడా తప్పక తెలుగు వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఈ జోనర్ కొత్తగా ఉంటుంది`` అని చెప్పారు.
ఈ సినిమాకు కెమెరా: యువరాజ్, సంగీతం: సిద్ధార్థ్ విపిన్, నేపథ్య సంగీతం: చిన్నా, పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, దర్శకత్వం: ధరణీధరన్, నిర్మాత: జక్కం జవహర్‌బాబు.



తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







