సౌదీలో అర మిలియన్ దాటిన నమోదిత ఆర్గాన్ డోనర్స్
- July 09, 2024
రియాద్: మరణించిన తర్వాత వారి అవయవాలను దానం చేయాలనుకునే వారి సంఖ్య సౌదీ అరేబియా మొత్తం 533,000 మంది దాతలకు చేరుకుందని సౌదీ సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వెల్లడించింది. పెద్ద సంఖ్యలో రోగులకు మెరుగైన జీవన నాణ్యతను అందజేయడానికి అవయవ మార్పిడిపై పెద్దెత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. మరణానంతరం అవయవాలను దానం చేయాలనుకునే వారి సంఖ్య పరంగా సౌదీ రాజధాని రియాద్ అగ్రస్థానంలో ఉంది. దాదాపు 142,000 మంది దాతలతో, మక్కా 115,000 మంది దాతలతో రెండవ స్థానంలో నిలిచింది. 65,000 మందితో తూర్పు ప్రావిన్స్ మూడవ స్థానంలో ఉంది నజ్రాన్‌లో 1,500 మంది దాతలు తమ పేర్లను నమోదు చేసుకున్నారని సౌదీ సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అధిపతి డాక్టర్ తలాల్ అల్-గౌఫీ తెలిపారు. సౌదీ అరేబియాలో అవయవ మార్పిడి ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుండి 2023 చివరి వరకు మొత్తం మార్పిడి చేసిన అవయవాల సంఖ్య 6,000 కంటే ఎక్కువగా ఉందని డాక్టర్ అల్-గౌఫీ వెల్లడించారు. అవయవ మార్పిడిలో సెంట్రల్ రీజియన్ అత్యధిక స్థాయిని సాధించిందని, దమ్మామ్ మరియు జెద్దా తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









