ఏపీలో NATS కంప్యూటర్ శిక్షణా కేంద్రం
- July 14, 2024
అమరావతి: అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్..ఇటు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తుండటం అభినందనీయమని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు జిల్లా వట్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నాట్స్ ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవంలో చింతమనేని పాల్గొన్నారు. అమెరికాలో ఉంటూ ఇక్కడ తమ స్వగ్రామం మేలు కోసం తపించే భాను ప్రకాశ్ దూళిపాళ్ల లాంటి వారు నిజంగా నేటి యువతరానికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తారని ప్రశంసించారు. వట్లూరు గ్రామంలో విద్యార్ధులకు ఉపయోగపడేలా కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు చొరవ చూపిన భాను ప్రకాశ్‌ని అభినందించారు. నాట్స్, గ్లో, ఏలూరు రూరల్ లయన్స్ క్లబ్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన నాట్స్ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని రాధాకుమారి, చింతమనేని ప్రభాకర్‌లు ప్రారంభించారు. నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ల సహకారంతో నాట్స్ వైస్ ప్రెసిడెంట్ భాను ప్రకాశ్ ధూళిపాళ్ల వట్లూరు గ్రామంలో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఏర్పాటు అయింది. చైతన్య సారధి డైరెక్టర్ నాగరాజు సహకారంతో ఈ కేంద్రంలో 10 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న విద్యార్ధులు దీనిని వినియోగించుకునేలా సిద్దం చేశారు. విద్యార్ధులకు చిన్ననాటి నుంచే సాంకేతిక అంశాలపై అవగాహన, ఆసక్తి కలిగించేందుకే ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామని నాట్స్ వైస్ ప్రెసిడెంట్ భాను ప్రకాశ్ ధూళిపాళ్ల అన్నారు. పేదరికంగా కారణంగా విద్యార్ధులు సాంకేతిక విద్యకు దూరం కాకూడదనే ప్రభుత్వ పాఠశాలలో ఈ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి రోజు ఈ ల్యాబ్ నిర్వహణ, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా విద్యార్ధులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి మద్దతు అందించిన డాక్టర్ పూర్ణ బిక్కసాని, డాక్టర్ కొత్త శేఖరంకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఇంత చక్కటి కార్యక్రమానికి సహకరించిన నాట్స్ నాయకులు రాజేశ్ కాండ్రు, మురళీకృష్ణ మేడిచెర్ల, సుధీర్ మిక్కిలినేని, కిరణ్ మందాడి, రవి కిరణ్ తుమ్మల, సంకీర్త్‌కు భాను ప్రకాశ్ ధూళిపాళ్ల కృతజ్ఞతలు తెలిపారు.


తాజా వార్తలు
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్‌లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!







