ఇజ్రాయెల్ పై ICJ వ్యాఖ్యలను స్వాగతించిన సౌదీ అరేబియా

- July 20, 2024 , by Maagulf
ఇజ్రాయెల్ పై ICJ వ్యాఖ్యలను స్వాగతించిన సౌదీ అరేబియా

రియాద్: ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెల్ విధానాలు,  పద్ధతులకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) జారీ చేసిన సలహా అభిప్రాయాన్ని సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్వాగతించింది. గత 57 సంవత్సరాలుగా ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెల్ ఉనికి చట్టవిరుద్ధమని ICJ ధృవీకరించింది. అరబ్ పీస్ ఇనీషియేటివ్ మరియు అంతర్జాతీయ చట్టబద్ధత తీర్మానాలకు అనుగుణంగా పాలస్తీనా సమస్యకు న్యాయమైన,  సమగ్రమైన పరిష్కారాన్ని చేరుకోవడానికి ఆచరణాత్మక మరియు విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని రాజ్యం నొక్కి చెప్పింది. ఈ పరిష్కారం పాలస్తీనా ప్రజలకు వారి స్వయం నిర్ణయాధికారం, తూర్పు జెరూసలేం రాజధానిగా ఉన్న 1967 సరిహద్దుల్లో వారి స్వతంత్ర రాజ్య స్థాపనకు హామీ ఇవ్వాలని పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com