‘ప్రేమలు’ బ్యూటీని లాక్ చేసిన ‘మైత్రి’.!
- July 25, 2024
మమితా బైజు.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. మలయాళ బ్యూటీస్ అందరూ అంతే. ఒక్క సినిమా చేసినా సరే, తమ ఉనికి ప్రభావాన్ని అంతగా ఇంజెక్ట్ చేస్తుంటారు.
ఇంతకీ మమితా బైజు ఏం సినిమా చేసిందంటారా.? రీసెంట్‌గా రిలీజైన మలయాల మూవీ ‘ప్రేమలు’ హీరోయినే ఈ మమితా బైజు. మలయాళ సినిమానే అయినా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.
దాంతో, టాలీవుడ్‌లో ఇంకా స్ట్రెయిట్ సినిమా చేయకపోయినా సరే, ఈ భామ పరిచయమైపోయింది. ఇక, ఆ సినిమా ఫ్రబావంతో, పాపకి టాలీవుడ్ నుంచి అనేక అవకాశాలు పోటెత్తుతున్నాయ్.
వాటిలో ఇంకా చర్చల దశలోనే చాలా సినిమాల్ని హోల్డ్ చేసి వుంచేసింది మమితా బైజు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, మైత్రీ మూవీస్ బ్యానర్‌లో ఓ సినిమాకి మమితా బైజు సైన్ చేసిందని తెలుస్తోంది. డైరెక్టర్, హీరో పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







