ఫేక్ ఐడీ..స్నేహితుడిపై దాడి..ఆఫ్రికన్ వ్యక్తి అరెస్ట్
- August 02, 2024
మనామా: ఒక ఆఫ్రికన్ వ్యక్తి తన రెసిడెన్సీని పునరుద్ధరించడానికి ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. అతని స్నేహితుడిపై దాడి చేశాడు. అతడి ఇంటికి వెళ్లనే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆఫ్రికన్ వ్యక్తి దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడి తనదేనంటూ మరో వ్యక్తికి చెందిన రెసిడెన్సీ కార్డును పోలీసులకు అందజేసాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తదుపరి విచారణలో నిందితుడు సమర్పించిన ఐడీ కార్డు నిజమైనదని, 2022లో బహ్రెయిన్ నుంచి వెళ్లిన వ్యక్తికి చెందినదని తేలిందని పోలీసులు తెలిపారు. మరొక వ్యక్తికి చెందిన చెల్లుబాటు అయ్యే ID కార్డ్‌ను దుర్వినియోగం చేయడం, హాని కలిగించే ఉద్దేశ్యంతో దాడి చేసినట్లు నిందితుడిపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. ఈ కేసు విచారణను ఆగస్టు 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







