సౌదీలో ఉపాధి, శిక్షణ కోసం SR3.7 బిలియన్లు..!
- August 19, 2024
రియాద్: సౌదీ మానవ వనరుల అభివృద్ధి నిధి (HADAF) ఈ సంవత్సరం ప్రథమార్థంలో సౌదీల ఉపాధి, శిక్షణ కోసం సుమారు SR3.7 బిలియన్లు ($986 మిలియన్లు) ఖర్చు చేసిందని మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రి ఇంజిఅహ్మద్ అల్-రాజీ వెల్లడించారు. 100,000 కంటే ఎక్కువ సంస్థలు ఈ కార్యక్రమాల నుండి లబ్ది పొందాయన్నారు. 153,000 మంది పౌరులు ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం ఏకీకృత జాతీయ ఉపాధి వేదిక ‘జదరత్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. "ఆంబిషన్ అండ్ ఎంపవర్‌మెంట్" అనే నినాదంతో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో ఉద్యోగార్ధుల ఉద్యోగ ప్రయత్నాలు పెంచడం ఫ్లాట్ ఫారమ్ లక్ష్యం అని వివరించారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలతో సౌదీ ఉద్యోగార్ధులకు అనుసంధానం చేయడానికి ప్లాట్‌ఫారమ్ పనిచేస్తోందన్నారు. ఈ సందర్భంగా HADAF డైరెక్టర్ జనరల్ టర్కీ అల్-జవినీ మాట్లాడుతూ..జదరత్ ప్లాట్‌ఫారమ్‌లో వివిధ స్పెషలైజేషన్లు, లేబర్ మార్కెట్‌లోని రంగాలలో సుమారు 70,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను అన్వేషించే లక్ష్యంతో ప్లాట్‌ఫారమ్ ప్రారంభించినట్టు ఆయన వివరించారు. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇ-రిక్రూట్‌మెంట్ కోసం ముందుగా జదరాహ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిందని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







