హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!

- September 07, 2024 , by Maagulf
హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!

ఇండిగో ఎయిర్ లైన్స్ విశాఖ నుంచి కొత్తగా 4 విమానయాన సర్వీసులను ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ కృషి వల్ల నడపనుంది.ఈ నెలలో ఒకటి, వచ్చే నెలలో మూడు కొత్త సర్వీసులను ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 21న ఉదయం 9 గంటలకు విశాఖ-హైదరాబాద్ సర్వీస్ ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత అక్టోబర్ 27న విశాఖ-విజయవాడ సర్వీస్ ను ప్రారంభించబోతున్నారు. 

ప్రతిరోజు ఉదయం 9:15 గంటలకు విశాఖ నుంచి ఒక విమానం ప్రారంభమవుతుంది. అదే రోజున విశాఖ-హైదరాబాద్ సర్వీస్ లను కూడా ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ విమానం విశాఖ నుంచి వెళుతుంది.మరోవైపు విశాఖ అహ్మదాబాద్ కు వారానికి మూడు రోజుల కొత్త సర్వీసు నడపనున్నట్లు ఏపీ ఏటీఏ ఇన్ ఛార్జీలు డిఎస్ వర్మ, ఓం నరేష్ కుమార్, కుమార్ రాజా తెలియజేశారు.

--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com