అల్-ఖోరాయేఫ్.. మైనింగ్ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం..!
- September 17, 2024
రియాద్: సౌదీ అరేబియాలోని పారిశ్రామిక, మైనింగ్ రంగాలలో పనిచేస్తున్న 90% కంపెనీలు చిన్న మధ్యతరహా పరిశ్రమలేనని పరిశ్రమ, ఖనిజ వనరుల మంత్రి బందర్ అల్-ఖోరాయేఫ్ ధృవీకరించారు. జనరల్ అథారిటీ ఫర్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ “మోన్షాత్” నిర్వహించిన “పరిశ్రమ మరియు మినరల్ రిసోర్సెస్ పయనీర్స్” కార్యకలాపాల్లోని డైలాగ్ సెషన్లో అల్-ఖోరాయెఫ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. మైనింగ్ రంగంలో, గనులను సంరక్షించడంలో ఆధునాతన సాంకేతికతలను ప్రవేశపెట్టినట్టు వివరించారు. దాంతో పర్యావరణం, భద్రత, ఉత్పాదకత ఉన్నత స్థాయిలో ఉంటుందన్నారు. నేడు మైనింగ్ రంగం పారిశ్రామికవేత్తలకు గొప్ప అవకాశాలను కలిగి ఉందని, ఈ రంగంలో అందుబాటులో ఉన్న ఈ అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని పారిశ్రామికవేత్తలందరికీ పిలుపునిచ్చారు. పారిశ్రామిక మైనింగ్ రంగాలలో పారిశ్రామికవేత్తలు చిన్న మధ్య తరహా పరిశ్రమల యజమానులు ప్రయోజనం పొందేందుకు మంత్రిత్వ శాఖ పనిచేసిన 100 కంటే ఎక్కువ ప్రోత్సాహకాలు ఉన్నాయని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







