'మజాకా' ఫస్ట్ లుక్ విడుదల
- September 23, 2024
సందీప్ కిషన్, త్రినాధ రావు నక్కిన, ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్, రాజేష్ దండా మాస్-ఫ్యామిలీ ఎంటర్టైనర్ #SK30 టైటిల్ 'మజాకా', ఫస్ట్ లుక్ లాంచ్, సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్.
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమాకి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తాసహ నిర్మాత. ఈ హెల్తీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, రిలీజ్ టైం రివిల్ చేయడం ద్వారా మేకర్స్ ప్రమోషన్లను ప్రారంభించారు.
#SK30కి 'మజాకా' అనే టైటిల్ పెట్టారు, టైటిల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సందీప్ కిషన్ పర్ఫెక్ట్ సంక్రాంతి బుల్లోడుగా కనిపించారు.సంప్రదాయ పట్టు పంచె, చొక్కా ధరించి, తన భుజంపై పెద్ద టేప్ రికార్డర్‌తో కుర్చీపై కూర్చుని కనిపించారు. సంక్రాంతి పండగని తలపించిన ఈ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. కలర్ఫుల్గా వున్న ఫస్ట్ లుక్ ప్లజెంట్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది.
ఈ మూవీలో రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు, నిర్మాతలు అనౌన్స్ చేసినట్లు, ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సంక్రాంతి పర్ఫెక్ట్ సీజన్.
రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, దర్శకుడు త్రినాధరావు నక్కినతో అసోషియేషన్ ని కొనసాగిస్తూ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాశారు.
లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు, మేకర్స్ త్వరలో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభిస్తారు. ఈ చిత్రానికి నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: సందీప్ కిషన్, రావు రమేష్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
బ్యానర్లు: ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్
నిర్మాత: రాజేష్ దండా
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ పోపూరి
సంగీతం: లియోన్ జేమ్స్
డీవోపీ: నిజార్ షఫీ
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హ్యాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







