శ్రీవారి ఆలయంలో ప్రాయశ్చిత్త హోమం పూర్తి

- September 23, 2024 , by Maagulf
శ్రీవారి ఆలయంలో ప్రాయశ్చిత్త హోమం పూర్తి

తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన నేపథ్యంలో సోమవారం ఆలయంలో ప్రాయశ్చిత్తహోమం నిర్వహించింది టీటీడీ. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య ఆలయంలోని యాగశాలలో ప్రత్యేకంగా పుణ్యహవచనం, మహాశాంతి హోమం, వాస్తు హోమం పంచగవ్య సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆగమ సలహామండలి సూచించడంతో అందుకు అనుగుణంగా శరవేగంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. అటు రాష్ట్రం ఇటు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లడ్డూలో కల్తీనెయ్యి వినియోగం వివాదం నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహించాలన్న సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలను టీటీడీ అమలు చేసింది. లడ్డూ వివాదం జూలై నెలలో జరిగిన నేపథ్యంలో అటు తరువాత ఆలయ సంప్ర దాయాల మేరకు ఆగస్టు 15 నుంచి 17 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించినందున ఎలాంటి దోషాలు ఉండవని కాని భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంలో మరోసారి ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆగమ పండితులు అంగీకరించడంతో అందుకు అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేసి పూర్తిచేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com