సందీప్ కిషనా.! ‘మజాకా’నా.!
- September 23, 2024
సందీప్ కిషన్ ఈ సారి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లున్నాడు. తన కొత్త సినిమా కోసం పేరు మార్చేసుకున్నాడు. న్యూమరాలజీ ప్రకారం తన పేరులో కొన్ని లెటర్స్ తీసేశాడు.
ఈ సారైనా సందీప్ కిషన్‌కి అదృష్టం పట్టాలి. నక్కిన త్రినాధరావు దర్శీకత్వంలో సందీప్ కిషన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి ‘మజాకా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. లేటెస్ట్గా టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తి రేకెత్తించేలా వుంది.
పెళ్లి కొడుకు దుస్తుల్లో కనిపిస్తున్నాడు సందీప్ కిషన్ ఈ పోస్టర్లో. చేతిలో ఓ పాత టేపురికార్డర్ వుంది. బ్యాక్ గ్రౌండ్లో పెళ్లి సారెలా కనిపిస్తోంది. పోస్టర్ చాలా బ్రైట్‌గా డిజైన్ చేశారు.
అంతేకాదు, ఈ సినిమాతో తన పేరులో సవరణ చేసుకోవడమే కాదండోయ్, పేరుకు ముందు ‘పీపుల్స్ స్టార్’ అనే ట్యాగ్ కూడా చేర్చేసుకున్నాడు సందీప్ కిషన్.
ఇన్ని మార్పులు చేర్పులతో వస్తున్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాడు. తాజా పోస్టర్ చూస్తుంటే, సంక్రాంతికి అసలు సిసలు యాప్ట్ సినిమాలాగే అనిపిస్తోంది ‘మజాకా’. చూడాలి మరి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







