పాపం ఎన్టీయార్.! రిలీజ్‌కి ముందే ఇలా జరిగిందేంటబ్బా.!
- September 23, 2024
ఎంతో ప్రెస్టీజియస్ మూవీ. చాలా జాగ్రత్తగా తెరకెక్కించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు. అంతే జాగ్రత్తగా ఈవెంట్ కూడా ప్లాన్ చేయాలిగా.!
కానీ, చేయలేదు. ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం. పాస్‌ల విషయంలో జరిగిన చిన్న రచ్చ.. పెద్ద చిచ్చుగా మారింది. ఫ్యాన్స్ కొట్టుకున్నారు. చాలా మందికి గాయాలు కూడా అయ్యాయ్.
దాంతో ఫైనల్‌గా ఈవెంటే రద్దు చేసేయాల్సిన పరిస్థితి వచ్చింది. రిలీజ్‌కి నాలుగు రోజులు ముందుందనగా.. ఇలా జరగడం నిజంగా దురదృష్టకరం.
అందుకే ఎన్టీయార్ చాలా బాధపడ్డారు. తన బాధనంతటినీ వ్యక్త పరుస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇలా జరగడం చాలా బాధాకరం.. ఫ్యాన్స్.. మీరే కాదు.. నేనూ చాలా బాధపడుతున్నాను.. అంటూ వ్యాఖ్యానించారు.
కానీ, ఇంత గొడవకు కారణమైన ఫ్యాన్స్‌ని ఒక్క మాట కూడా అనలేదు ఎన్టీయార్. ఫ్రస్టేషన్లో టంగ్ స్లిప్ అయితే.. అది ఎన్ని అనర్ధాలకు దారి తీస్తుందో అని భయపడ్డారో ఏమో చాలా కూల్‌గా డీల్ చేశారు.
ఈ ముందు జాగ్రత్త ఈవెంట్ మేనేజ్మెంట్కి కూడా వుంటే బాగుండేది. ఎన్టీయార్‌కి ఇలాంటి పరిస్టితి వచ్చేది కాదు. నిర్మాతలు నిర్లక్ష్యంతో చేతులెత్తేయడంతోనే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని సినీ ప్రముఖులు గడ్డి పెడుతున్నారు. ఏం చేస్తారు.! నష్టమైతే జరిగిపోయింది. ఈ నష్టం సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.!
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







