మెగాస్టార్ చిరంజీవికి అరుదైన పురస్కారం.!మెగా గిన్నీస్ రికార్డ్.!
- September 23, 2024
డాన్స్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే డాన్స్.. అంతలా డాన్స్‌పై ఓ చెరగని ముద్ర వేసేశారు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు, స్టైల్లోనూ చిరంజీవి రూటే సెపరేటు. ట్రెండ్ సెట్టర్ ఆయన.
నువ్వేమైనా చిరంజీవివనుకుంటున్నావేంట్రా.! అనేవారు ఎవరైనా స్టైల్ కటింగ్స్ ఇస్తే.! అలా చిరంజీవిని తమదైన జీవన శైలిలో మమేకం చేసుకన్నారు అభిమానులు.
అందుకే ఆయన గొప్పతనాన్ని గిన్నీస్ బుక్ కూడా గుర్తించింది. 150 సినిమాల్లో ఆయన చేసిన డాన్స్‌లను గొప్పగా పొగిడేస్తూ.. తన పుస్తకంలో ఓ పేజీని చిరు కానుకగా చిరంజీవికిచ్చేసింది.
చిరంజీవికి అవార్డులు, రివార్డులు కొత్తేం కాదు. ఏ అవార్డు ఆయనకు దక్కినా ఆ అవార్డుకే అందం, అసలైన గౌరవం అనేంతలా ఆ అవార్డు గొప్పతనం పెరిగిపోతుంటుంది. అలాగే ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయింది.
ఈ అవార్డు తనకు దక్కినందుకు ఎంతో సంతోషంగా వుందంటూ, చిరంజీవి ఫ్యాన్స్‌నుద్దేశించి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చిరంజీవికి పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా విషెస్ పంపుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..