ఫ్లూ వ్యాక్సినేషన్ హోమ్ సర్వీస్..ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- September 27, 2024
రియాద్: ఇన్ ఫ్లూయేంజా టీకా హోమ్ సర్వీస్‌ను ప్రారంభించినట్లు సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రజలు సనార్ అప్లికేషన్ ద్వారా హోమ్ టీకా సేవ కోసం అపాయింట్ మెంట్ ను తీసుకోవచ్చని తెలిపింది. తద్వారా ప్రదేశం, సమయం షెడ్యూల్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ సేవ పౌరులు మరియు నివాసితులకు అందుబాటులో ఉందని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది వంటి హాని కలిగించే సమూహాలకు వ్యాక్సిన్ అందుబాటును పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇన్ ఫ్లూయేంజా వ్యాక్సిన్ సురక్షితమని, ప్రభావవంతంగా పనిచేస్తుందని మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. ఈ సేవను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..