కువైట్ లో నవంబర్ 3 నుండి ప్రాజెక్ట్ వీసా బదిలీలు.. నిబంధనలు ఇవే..!!

- October 01, 2024 , by Maagulf
కువైట్ లో నవంబర్ 3 నుండి ప్రాజెక్ట్ వీసా బదిలీలు.. నిబంధనలు ఇవే..!!

కువైట్: ప్రాజెక్ట్ వీసా బదిలీలకు కువైట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవంబర్ 3 నుండి నిర్దిష్ట షరతులతో ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రాజెక్ట్‌ల నుండి కార్మికులను ఇతర రంగాలకు బదిలీ చేయడానికి కువైట్ నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం.. కార్మికుడిని బదిలీ చేయడానికి ప్రభుత్వ ఒప్పందం లేదా ప్రాజెక్ట్ తప్పనిసరిగా రద్దు చేయబడాలి. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ తప్పనిసరిగా ప్రాజెక్ట్ పూర్తయినట్లు నిర్ధారిస్తూ ఒక లేఖను సమర్పించారలి. కార్మికులు ఆ ప్రాజెక్ట్‌తో కనీసం ఒక సంవత్సరం పూర్తి చేసుకోవాలి. బదిలీ కోసం కార్మికుడు తప్పనిసరిగా యజమాని ఆమోదం పొందాలి. బదిలీ ప్రక్రియ కోసం 350 దినార్ల అదనపు రుసుము వసూలు చేయబడుతుందని అధికార యంత్రాంగం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com